గంజాయి మొక్కలు పెంచుతున్న సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్

గంజాయి మొక్కలు పెంచుతున్న సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్

హైదరాబాద్ : రాష్ట్రప్రభుత్వం గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపి పూర్తిగా అణిచివేయాలని చూస్తుంటే.. దుండగులు అంతకంతా రెచ్చిపోతున్నారు. గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని గురువారం ఎక్సైజ్ టీమ్ పట్టుకుంది. కుత్బుల్లాపూర్ పీఎస్ పరిధిలో దూలపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు చేశారు. 

బీహార్ కు చెందిన వికాస్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. స్వస్తిక్ స్టీల్ గోడ ఆవరణలో వికాస్ మూడు గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఎక్సైజ్ అధికారులు మొక్కలను పీకేశారు. గంజాయి మొక్కలు పెంచుతూ.. వికాస్ స్వంతంగా వాడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. వికాస్ పై ఎక్సైజ్ పోలీసులు కేసునమోదు చేశారు.