భద్రతా లోపం.. అమిత్ షా కాన్వాయ్పై దూసుకొచ్చిన కారు 

భద్రతా లోపం.. అమిత్ షా కాన్వాయ్పై దూసుకొచ్చిన కారు 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాన్వాయ్ పై ఓ కారు వేగంగా దూసుకురావడం తీవ్ర అలజడికి దారితీసింది. త్రిపుర పర్యటనలో భద్రతా వైఫల్యా ఈ సంఘటనకు దారి తీసింది. అమిత్ షా అగర్తల ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిపుర సీఎం మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం ముగించుకొని తిరిగి వెళ్తున్న అమిత్ షా కాన్వాయిపై కారు దూసుకొచ్చింది.

ఎయిర్ పోర్ట్ వెళ్లేందుకు పోలీస్ లు ట్రాఫిక్ కంట్రోల్ చేశారు. ఆ ట్రాపిక్ లో ఉన్న వ్యక్తి ఆగకుండా తన కారుతో ముందుకు వచ్చాడు. పోలీసులు ఆపినా ఆడకుండా వాళ్లనుంచి దూసుకెళ్లాడు. ఈ ఘటన వల్ల ఎవరికీ ఏం ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై దర్యాప్తు ప్రారంభించినా ఇంతవరకు ఎవరినీ పట్టుకోలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని పోలీసులను కోరాయి.