ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌‌లో సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌‌లో సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు

న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్‌‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్  దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌‌ఏఎస్‌‌ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కుల(ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55%)తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్. ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి. వయసు 27 ఏళ్లు మించరాదు. 

సెలెక్షన్​ ప్రాసెస్​: డిగ్రీ మార్కులు, ఐ/ కలర్‌‌ బ్లైండ్‌‌నెస్‌‌ ఎగ్జామ్‌‌, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది. డిసెంబర్ 8 వరకు ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.aaiclas.aero సంప్రదించాలి.