కోర్టకు ఎక్కిన పబ్జీ లవర్స్ పెళ్లి.. భార్య మరో పెళ్లి చెల్లదంటున్న భర్త

కోర్టకు ఎక్కిన పబ్జీ లవర్స్ పెళ్లి.. భార్య మరో పెళ్లి చెల్లదంటున్న భర్త

ఆన్ లైన్ లో పబ్జీ ఆడుతూ పరిచమై.. ఆ పరిచయం ప్రేమగా మారిన సీమా హైదర్, సచిల్ మీనా లవ్ స్ట్రోరీ తెలిసే ఉంటుంది. ప్రేమించిన సచిన్ కోసం పాకిస్థాన్ నుంచి తన నలుగురు పిల్లలతో పారిపోయి వచ్చింది. ముస్లీం అయిన ఆమె హిందూ మతాన్ని స్వీకరించి సచిన్ ను వివాహం చేసుకుంది. అక్రమంగా భారత్ లోని ప్రవేశించిందని ఆమెపై కేసు కూడా పెట్టారు. పాకిస్థాన్ లోని సీమా మాజీ భర్త గులాం హైదర్ తనని సచిన్, సీమాలు మోసం చేశారని లక్నో కోర్టులో కేసు వేశాడు. గురువారం ఈ కేసు విచారణకు రాగా గులాం హైదర్ తరుఫున భారత్‌కు చెందిన న్యాయవాది మోమిన్ మాలిక్ వాదనలు వినిపించారు. 

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌ కు నోయిడా వ్యక్తి సచిన్‌ మీనాతో జరిగిన పెళ్లి చెల్లుబాటు కాదని పాకిస్థాన్‌కు చెందిన ఆమె భర్త గులాం హైదర్ ఆరోపించాడు. గులాం హైదర్‌ నుంచి సీమా హైదర్‌ విడాకులు పొందలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సచిన్‌తో ఆమె పెళ్లి చెల్లదని వాదించారు. భారత్ లో సచిన్‌ను పెళ్లి చేసుకున్నట్లు బహిరంగంగా సీమా చెప్పింది. కానీ, అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిదన్న కేసులో అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ దరఖాస్తులో భర్త పేరు గులాం హైదర్‌గా పేర్కొందని న్యాయవాది మోమిన్ కోర్టుకు తెలిపారు.

సీమా తరుపు న్యాయవాది సీఆర్పీసీ కింద భారత్‌లో కేసు నమోదు చేయడానికి పాకిస్థాన్‌ పౌరులకు అనుమతి లేదని తెలిపారు.  కేవలం ప్రచారం కోసమే ఈ కేసు వేశారని సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ దీనిపై అన్నారు. సీమ హిందూమతాన్ని స్వీకరించి సచిన్‌ను పెళ్లిచేసుకున్నదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు ఏప్రిల్‌ 18 నాటికి దీనిపై నివేదిక సమర్పించాలని నోయిడా పోలీసులకు నోటీసు జారీ చేసింది.