రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ లీడ్ రోల్స్‌లో దేవేందర్ తెరకెక్కించిన చిత్రం ‘సీత ప్రయాణం కృష్ణతో’. రాజీవ్, రోజా భారతి నిర్మించారు. శరవణ వాసుదేవన్ సంగీతం అందించాడు. ఈ నెల 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరోయిన్ రోజా భారతి మాట్లాడుతూ ‘నన్ను నమ్మి అందరు ఈ సినిమా వాళ్లది అని అనుకుని పనిచేసారు కాబట్టే ఇవాళ రిలీజ్ వరకు రాగలిగాం.
ఎమోషనల్ కంటెంట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా ప్రజెంట్ చేశాం. చక్కని మెసేజ్ కూడా ఉంది. కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందనే నమ్మకముంది’ అన్నారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు దినేష్, రాఖి శర్మ థ్యాంక్స్ చెప్పారు. వినోదాత్మకంగా సాగే ఫ్యామిలీ సినిమా అని దర్శకుడు దేవేందర్, నిర్మాత రాజీవ్ తెలియజేశారు.
