శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశీ డబ్బు పట్టివేత

V6 Velugu Posted on Mar 24, 2021

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా విదేశాలకు తీసుకెళ్తున్న రూ.13 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేస్తున్న ఇంటెలిజెన్స్ ఆధికారులకు హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తున్న మహమ్మద్ అనే ప్రయాణికుడి అనుమానాస్పద కదలికలతో అప్రమత్తమయ్యారు. అతన్ని ఆపి తనిఖీలు చేయగా  1.3 కోట్ల విదేశీ కరెన్సీ దొరికింది. ఈ నగదును విదేశాల నుండి ఎలా తీసుకొచ్చాడు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే వివరాల కోసం విచారిస్తున్నారు. దుబాయ్ వెళ్తున్ననిందితుడు మహమ్మద్ ను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అక్రమంగా విదేశీ నగదుతో పట్టుపడిన నిందితుడి పూర్వ పరాలతోపాటు.. స్మగ్లర్లతో సంబంధాలున్నాయా.. తదితర కోణాల్లో కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. 

Tagged foreign, Shamshabad, airport, dubai, currency, travelling, passenger, seiz, Mohammad

Latest Videos

Subscribe Now

More News