ఆగ్రోస్ తో యువతకు స్వయం ఉపాధి 

ఆగ్రోస్ తో యువతకు స్వయం ఉపాధి 

హైద‌రాబాద్- యువ‌త‌కు స్వ‌యం ఉపాధి అందించే విధంగా ఆగ్రోస్ ప‌ని చేస్తుంద‌న్నారు వ్య‌వ‌సాయ‌శాఖ‌ మంత్రి నిరంజ‌న్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న నాంపల్లిలోని ,రెడ్ హిల్స్ లో తెలంగాణ ఆగ్రోస్ కొత్త‌ కార్యాలయం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన‌ మంత్రి నిరంజన్ రెడ్డి...యువతకు స్వయం ఉపాధి అందించే విదంగా ఆగ్రోస్ పని చేస్తుంద‌న్నారు. గతంలో ఆగ్రోస్ సంస్థ కుంటుపడి ఉండేదని..తెలంగాణ ఏర్పడ్డాక మెల్లి మెల్లిగా అభివృద్ధి పథంలో మందుకెళ్తోందన్నారు. రెండు సంవత్సరాలుగా చాలా విస్తరించిందని..6 కోట్ల నుండి 151 కోట్ల టర్నోవర్ కు చేరిందని తెలిపారు. నికర ఆదాయం రెండు కోట్లు ఉందన్న నిరంజ‌న్ రెడ్డి..రాబోయే రోజుల్లో ఆగ్రోస్ ను మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఆగ్రోస్ సేవా కేంద్రాలు 120 ఉండేవని...ప్రస్తుతం అవి 11 వందలకు  విస్తరించామ‌న్నారు. రైతులు పండించిన పంటలకు ఆగ్రోస్ సేవా కేంద్రాలు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని..తెలంగాణ  మామిడికి  ప్రసిద్ధి అన్నారు. అయినా మార్కెట్లో రైతులకు సరైన గిట్టుబాటు కావడం లేదని..వ్యాపారులు, దళారులు అడిగిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు.

ఆగ్రోస్ సంస్థ వ్యాపార నెట్ వర్క్ పై దృష్టి పెట్టాలన్నారు. పట్టుదలతో పని చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఆగ్రోస్ ఉద్యోగస్తులకు అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్రంలో 6వేల పైచిలుకు  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలున్నాయని..సజావుగా సాగే విదంగా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. రైతులకు కల్లాలు కట్టుకునేందుకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తాన‌న్నా ..కొంతమంది ముందుకు రావడం లేదని తెలిపారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి.