కుల సంఘాలు ఒక్కటైతేనే ఆత్మ గౌరవ భవనాలు

కుల సంఘాలు ఒక్కటైతేనే ఆత్మ గౌరవ భవనాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు పత్తాలేవు. ఏక సంఘాల ఏర్పాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలను ఆలస్యం చేస్తోంది. ఆయా కులాలు ఏక సంఘంగా ఏర్పడితేనే భవనాలకు అనుమతులు ఇస్తామని సర్కారు తేల్చి చెప్పింది. కానీ అనేక కులాల్లో ఏకాభిప్రాయం రాక, ఏక సంఘం ఏర్పాటు దిశగా అడుగులు పడటం లేదు. కొన్ని క్యాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో కమిటీ ఏర్పాటైనా కనీసం భూమి పూజ కూడా చేయలేదు. ఫలితంగా నాలుగేండ్ల నుంచి ఆత్మ గౌరవ భవన నిర్మాణాలు పేరుకే పరిమితమయ్యాయి.

43 ఆత్మగౌరవ భవనాలకు ల్యాండ్​

రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికలకు ముందు బీసీల్లోని 43 కులాలకు ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయిస్తూ జీవోలు విడుదల చేసింది. 90 ఎకరాల దాకా అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇందులో 23 కులాలకు కమ్యూనిటీ భవనాల కోసం ఎకరం చొప్పున కేటాయించింది. విశ్వబ్రాహ్మణ, రజక, మున్నూరుకాపు, తెలంగాణ కౌండిన్య ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ముదిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కులాలకు 5 ఎకరాల స్థలంతో పాటు రూ.5 కోట్ల చొప్పున నిధులు అలకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. శాలివాహన (కుమ్మరి), గంగపుత్ర కులాలకు 3 ఎకరాలు, పెరిక, సగర లేదా ఉప్పర, దూదేకుల నాయీబ్రాహ్మణ కులాలకు రెండెకరాలు కేటాయించారు. దేవాంగ, పట్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కులాలకు 30 గుంటల చొప్పున స్థలం, కచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భట్రాజు రాంగ్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా భవసార క్షత్రియ కులాలకు 20 గుంటల చొప్పున, భుంజ, జాండ్ర, నీలికుల కులాలకు 10 గుంటల చొప్పున స్థలం అలకేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆయా కులాలకు భవనాల కోసం కోకాపేట, ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల్లో భూ కేటాయింపులు జరిగాయి. వీటిలో ఆయా కులాల కార్యకలాపాలు, వివిధ పనులకు జిల్లాల నుంచి వచ్చే వారు ఉండేందుకు ఉపయోగపడతాయని భావించారు.

కుల సంఘాల్లో కుదరని ఏకాభిప్రాయం..

ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించి పట్టించుకోని సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. గతేడాది నుంచి కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఆయా కులాల్లోని సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని, అంతా కలిసి కమిటీగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. అ తర్వాత భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామంది. ఈ ఏక సంఘం కమిటీ ఆధ్వర్యంలోనే సభ్యులు చెప్పినట్లు భవనాలను కట్టిస్తామని పేర్కొంది. ఇందుకోసం దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే, సంఘాల్లో మాత్రం ఏకాభిప్రాయం రావడం లేదు. పార్టీకో కుల సంఘం ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏక సంఘంగా ఏర్పడటం కష్టంగా మారడంతో భవన నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయి. 

నాలుగేండ్లుగా అడుగు ముందుకు పడలే..

2018 ఎన్నికలకు ముందు ప్రభుత్వం జీవోలు రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా ఇప్పటి దాకా ఒక్క భవనం కూడా కట్టలేదు. మరోవైపు 18 దాకా ఏక సంఘంగా ఏర్పడ్డాయని మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించినా, వాటిని కూడా పట్టించుకోడం లేదు. అందులో రెండు, మూడు సంఘాలకు మాత్రమే ఇటీవల భూమి పూజ చేశారు. ఇతర కులాలకు లేని ఏక సంఘాలు బీసీ కులాలకే ఎందుకని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏడాది, రెండేండ్ల కిందట ప్రారంభించిన కొత్త సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలెక్టరేట్లు, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆఫీసు భవనాలు మాత్రం తుది దశకు చేరుకున్నాయని, బీసీ భవనాలు మాత్రమే ఎందుకు ప్రారంభం కావడం లేదంటున్నాయి. కాగా, ఆత్మ గౌరవ భవనాలపై జీవోలు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. భవన నిర్మాణాలకు రూ.90 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా, రూ.10 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ, నిధులు రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. ఇక, ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పట్టించుకోపోవడంతో ఆ స్థలంలో గడ్డి మొక్కలు, పిచ్చి చెట్లు పెరిగి దర్శనమిస్తున్నాయి. సగర సంఘం భవనాన్ని క్రిస్టియన్లకు కేటాయించడంతో వివాదం నడుస్తోంది. దీనిపై ఆ కులస్తులు ఆగ్రహంతో ఉన్నారు.

బీసీ కులాలకే ఏక సంఘాలెందుకు..?

ఇతర కులాల్లో భవన నిర్మాణాలకు ఏక సంఘాలు ఏం లేవు. మరి బీసీల్లోని కులాలకు ఎందుకు..? సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఏక సంఘాలను తెరపైకి తెచ్చింది. ఒక్కో పార్టీకి ఒక్కో కుల సంఘం ఉంటే ఏకాభిప్రాయం ఎట్ల వస్తది..? అసలు ఏక సంఘం క్రిటేరియా, గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనేవే లేవు. బీసీ ఆత్మగౌరవ భవనాలు కాదు.. అవి ఎన్నికల భవనాలు. సెక్రటేరియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఆఫీసులు మాత్రం చకచకా కట్టుకుంటున్నరు. మా భవనాల నిర్మాణ పట్టించుకోవడం లేదు.  

- జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు