హేమ మాటలు తప్పుదోవ పట్టించేలా ఉన్నయ్

V6 Velugu Posted on Aug 09, 2021

హైదరాబాద్: తెలుగు నటీనటుల సంఘంలో నిధుల దుర్వినియోగం జరుగుతోందంటూ సీనియర్ నటి హేమ చేసిన వ్యాఖ్యలను మా అధ్యక్షుడు నరేష్ ఖండించారు. హేమ కామెంట్స్ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆమెపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ మేరకు ‘మా’ జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్‌‌తో కలసి అసోసియేషన్ నిధుల వ్యయంపై మరోసారి వివరాలు వెల్లడించిన ఆయన.. ‘మా’ అధ్యక్ష పదవిపై తనకు ఎలాంటి వ్యాయోహం లేదని స్పష్టం చేశారు. 

హేమ వ్యాఖ్యలు అర్థరహితమన్న నరేష్.. ఆగస్టు 22న జరిగే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం మేరకు ఎన్నికలు ఉంటాయని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎలక్షన్స్ జరుగుతాయని పేర్కొన్నారు. హేమ చేసిన ఆరోపణలు అసోసియేషన్ సభ్యులను తప్పుదోవపట్టించేలా ఉన్నాయని జీవిత రాజశేఖర్ తెలిపారు. ‘మా’ ఎన్నికల సందర్భంలో నరేష్ కు వ్యతిరేకంగా తాము కూడా సభ్యులకు లేఖలు రాశామని, అయితే అందరూ కలసికట్టుగా ఉండాలనేదే తమ ఉద్దేశమని జీవిత పేర్కొన్నారు. 

Tagged Naresh, Hema, MAA Elections 2021, Movie Artits Association, Jeevita Rajsekhar

Latest Videos

Subscribe Now

More News