సుమన్‌ సంచలన వ్యాఖ్యలు

సుమన్‌ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదని సీనియర్‌ నటుడు సుమన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం (మే 30వ తేదీన) దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దాసరిని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు నటుడు సుమన్‌ కూడా హాజరై.. మాట్లాడారు. 

దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారని సుమన్ గుర్తు చేశారు. బయ్యర్స్‌ గురించి దాసరి నారాయణ రావు ఆలోచించేవారని, ఒక సినిమా ప్లాప్‌ అయితే తర్వాత సినిమాను ఫ్రీగా చేసి బయ్యర్స్‌ను కాపాడేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న కొందరు నిర్మాతలు బయ్యర్స్‌ గురించి ఆలోచించడం లేదని, మేకర్స్‌ వల్ల బయ్యర్స్‌ నష్టపోతున్నారని చెప్పారు. నిర్మాతల తీరుతో బయ్యర్స్‌ సంతోషంగా ఉండటం లేదని, కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారని తెలిపారు. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతో బయ్యర్స్‌ కొంటున్నారని, ఒకవేళ ఆ సినిమా ప్లాప్‌ అయితే నష్టపోయేది బయ్యర్స్ అని చెప్పారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బయ్యర్ల గురించి ఆలోచించే వారే లేరని, సినిమా షూటింగ్స్‌లో సమయపాలన అసలే లేదన్నారు. నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్‌ ఉన్నారని, ఈ విషయాన్ని తాను ఆవేశంతో మాట్లాడుతున్నాను అనుకున్నా.. ఇది మాత్రం నిజమంటూ కామెంట్స్ చేశారు. సుమన్‌ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 

మరిన్ని వార్తల కోసం..

పుతిన్ మూడేళ్లకు మించి బతకడం కష్టమే ?

సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు