కాకా సేవలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందారు: బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ

కాకా సేవలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందారు: బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ

కాకా వెంకటస్వామి సేవలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందారని అన్నారు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. ఆదివారం (అక్టోబర్ 05) కాకా 96వ జయంతి వేడుకల సందర్భంగా నివాళులు అర్పించిన ఆయన.. కాకా వెంకటస్వామి గొప్ప పోరాట నాయకుడు అని అన్నారు. 

తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి పని చేసిన మహా నాయకుడు కాకా అని అన్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి పోరాడిన మహానుభావుడు కాకా అని కొనియాడారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాలలో వేలాదిమంది నిరుపేదలకు గుడిసెలు వేయించి ఇళ్లను అందించిన నాయకుడు కాకా అని అన్నారు.

సమాజంలో కార్మికుల పక్షాన నిలబడి పోరాడిన నాయకుడు కాకా అని అన్నారు బండారు దత్తాత్రేయ. కార్మికుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉండి వారికి అండగా నిలిచారని కొనియాడారు. కాకా స్ఫూర్తితో వారి కుమారులు వివేక్ వెంకట స్వామి, వినోద్ లు సమాజంలో ప్రజలకు సేవలు అందించడం అభినందనీయం అని అన్నారు.