
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కు షాక్ తగిలింది. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పలు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయంటూ ఓ సీనియర్ సిటిజన్ ఝలక్ ఇచ్చింది. నగరంలోని హిమాయత్ నగర్ డివిజన్ ఎన్నికల ఇన్‌చార్జ్ గా వ్యవహరిస్తున్న మంత్రి గంగుల.. ప్రచారంలో భాగంగా హిమాయత్ నగర్ లో అపార్ట్ మెంట్ వాసులతో సమావేశం నిర్వహించారు. కాలనీ లలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రిని… ఓ వృద్ధురాలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీర్చలేదని , పెన్షన్ , హెల్త్ కార్డ్ , నిరుద్యోగ సమస్యలున్నాయని నిలదీసింది. ఆమె మాట్లాడుతుండగానే మంత్రి సమావేశాన్ని నిలిపివేశారు. అన్ని సమస్యలను త్వరలోనే తీరుస్తామని అక్కడి నుండి వెళ్లిపోయారు.