సబ్​జైల్​ను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి

సబ్​జైల్​ను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి

జనగామ అర్బన్, వెలుగు : జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ శనివారం జిల్లా కేంద్రంలోని సబ్​జైల్​ను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న సదుపాయాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు.

బెయిల్ గ్రాంట్ అయిన ప్రతి ఒక్కరినీ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ దృష్టికి తీసుకురావాలని సబ్​జైల్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్​జైల్ సూపరింటెండెంట్​ కృష్ణ కాంత్, జైల్​ సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.