మంత్రి కొండా సురేఖకు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆర్ అవగాహనతో మీడియా సమావేశం నిర్వహించాలన్నారు. కొండా సురేఖను రెచ్చగొట్టి తన్నించుకుంటున్నారని విమర్శించారు.
దేశ వ్యాప్తంగా వసూలు చేసిన నల్లధనంతో 15లక్షలు పేదవాడి అకౌంట్ లో వేస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. డ్రామాలు ఆడడం రాకపోవటమే కాంగ్రెస్ బ్యాడ్ లక్ అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యాడన్నారు జగ్గారెడ్డి.
ALSO READ | మంత్రి సురేఖ గారూ.. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి : నాగార్జున
మరో వైపు మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి సురేఖపై సోషల్ మీడియాలో ట్రోల్స్ తో మొదలైన వార్... ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. మంత్రి కొండా సురేఖ.. ఊహించుకొని ఏడుపులు పెడబొబ్బలు పెడితే మాకేం సంబంధమని మీడియా చిట్ చాట్ లో చెప్పారు కేటీఆర్. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని ఆరోపించడంపై ఫైరయ్యారు . వాళ్ళకు జీవితాలు ఉండవా.... తమ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇలాంటి మాటలకు తాము బాధపడమా అంటూ సురేఖ కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.