
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. గురువారం (అక్టోబర్ 23) ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలకు తెగించి తన భార్య, కూతురిని కాపాడిన నేత.. చివరికి ఊపిరాడక చనిపోయాడు. ఇండోర్ లోని తన ఇంట్లో చోటు చేసుకున్న ప్రమాదంలో నర్మద సేన జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రవేశ్ అగర్వాల్ మృతి చెందాడు.
గురువారం (అక్టోబర్ 23) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం జరిగింది. ఇండోర్ లోని స్కీమ్ నెంబర్ 78 దగ్గర ఉన్న మహీంద్ర షోరూం పైన ఉన్న తన ఇంట్లో ఈ ప్రమాదం జరగడంతో ప్రవేశ్ అగర్వాల్ చనిపోయారు.
ప్రమాద సమయంలో భార్య, కూతురును కాపాడే ప్రయత్నం చేశారు. కాపాడే క్రమంలో బాగా పొగ పీల్చుకుని ఊపిరాడక చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అగర్వాల్ పెద్ద కూతురు సౌమ్య అగర్వాల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ తెలియలేదు. అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనంగా మారింది. పార్టీలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఘటనకు సంబంధించి కారణాలను వెలికితీసే పనిలో ఉన్నారు పోలీసులు.