గ్రేటర్ నోయిడా: నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్ల జోరు నడుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, అమిత్ పంగల్ మెగా టోర్నీలో ముందంజ వేశారు. మంగళవారం జరిగిన విమెన్స్ 75 కేజీ ప్రి క్వార్టర్స్‌లో బొర్గొహైన్ (అస్సాం) 3–2తో స్వీటీ బూర (హర్యానా)పై కష్టపడి గెలిచింది. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, హర్యానా బాక్సర్ పూజా రాణి (80 కేజీ)5–-0 తేడాతో అంజు (చండీగఢ్)ను చిత్తు చేసింది. మెన్స్ 55 కేజీ బౌట్‌లో అమిత్ పంగల్ 3–2 తేడాతో హర్యానా బాక్సర్‌పై ప్రియాన్షుపై పోరాడి విజయం సాధించాడు. మరో బౌట్‌లో జాదుమణి సింగ్... పార్తిబన్ (తమిళనాడు)ను చిత్తు చేశాడు.
