నాలుగు నెలలుగా జీతాల్లేవ్

నాలుగు నెలలుగా జీతాల్లేవ్

నాగర్ కర్నూల్: నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జీతాలు ఇవ్వడంలేదని రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలు విడుదల చేయాలని, లేకుంటే జులై రెండు నుంచి ఆందోళనను మరింతి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక డాక్టర్లు ఆందోళనకు దిగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.