గ్రేట్ ఓటర్ ఓటేశారు…! ఈసీ అపూర్వ స్వాగతం

గ్రేట్ ఓటర్ ఓటేశారు…! ఈసీ అపూర్వ స్వాగతం

శ్యామ్ సరన్ నేగి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 102 ఏళ్ల సీనియర్ ఓటర్.  స్వతంత్ర భారతంలో జరిగిన 1951లో జరిగిన తొలి జనరల్ ఎలక్షన్ లో ఓటేసిన ఆయన.. తాజాగా.. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఓటు వేశారు.

శ్యామ్ సరన్ నేగికి ఈసీ సకల మర్యాదలు కల్పించి… దగ్గరుండి ఓటేయించింది. కల్పాలోని ఓ పేదకుటుంబం ఆయనది. ఆయనకు ఈసీ దగ్గరుండి పోలింగ్ స్టేషన్ కు తీసుకొచ్చింది. ఈసీ అధికారులు ఆయనకు పోలింగ్ బూత్ వద్ద స్వాగతం పలికారు. దగ్గరుండి ఓట్ వేయించారు. అరుదైన ఓటరు కావడంతో… శ్యామ్ సరన్ నేగిని ఓ సెలబ్రిటీని మించి గౌరవించారు అధికారులు. ఆయన పోలింగ్ బూత్ కు వచ్చినప్పుడు మిగతా ఓటర్లు కూడా సహకరించారు. ఆయనతో ఫొటోలు దిగారు.