‘సీఎస్‌ఐ సనాతన్‌’ నుంచి సాంగ్ విడుదల

‘సీఎస్‌ఐ సనాతన్‌’ నుంచి సాంగ్ విడుదల

శివ శంకర్‌ దేవ్‌ దర్శకత్వంలో చాగంటి ప్రొడక్షన్‌లో అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ‘సీఎస్ఐ సనాతన్’ మూవీ నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఆది సాయికుమార్’ హీరోగా నటిస్తుండగా.. మిషా నారంగ్ హీరోయిన్ గా నటించారు. ‘నా కల నీవే.. కనుకే కలిశావే..నా జత నీదే జతగా దొరికావే’ అంటూ సాంగ్ సాగింది. యాజిన్ నిజర్ పాట పాడగా మధ్యలో అనురుధ్ శాస్త్రీ (రాపర్) కూడా పాడారు. అందమైన లోకేషన్ లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకొనే విధంగా ఉంది. 

ఈ కేసు విచారణ సాగే క్రమం.. ఆద్యంతం ఆసక్తిని రేకేత్తే విధంగా తెరకెక్కించారని తెలుస్తోంది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఎలాంటి నేరాన్నయినా చేధించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ పాత్ర రూపొందింది. ఈ క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఇటీవలే గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ మూవీలో అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్నప్ప, మ‌ధు సూద‌న్, వసంతి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు.