ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం.. షరపోవా తర్వాత తొలి టైటిల్ నెగ్గిన మిరా ఆండ్రీవా

ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం.. షరపోవా తర్వాత తొలి టైటిల్ నెగ్గిన మిరా ఆండ్రీవా

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అప్పుడెప్పుడో షరపోవా గ్రాండ్ స్లామ్ గెలిచింది. అంతే అప్పటి నుంచి రష్యాకు టైటిల్ లేదు. దాదాపు 12 ఏండ్ల తర్వాత మిరా ఆండ్రీవా రూపంలో టైటిల్ ఆ దేశానికి టైటిల్ దక్కింది. 

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ లో రష్యన్‌ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్‌.. మిరా ఆండ్రీవా  విజేతగా నిలిచారు. పారిస్‌ వేదికగా శనివారం (2026 జూన్ 06) జరిగిన ఫైనల్‌ పోరులో పోలెండ్‌కు చెందిన చ్వాలిన్‌స్కాపై 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది.

►ALSO READ | రాహుల్ క్లాస్, గిల్ మాస్.. తొలి రోజే ఆఫ్ఘన్పై భారత్దే ఆధిపత్యం

 ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. రెండు వరుస సెట్లలో ఆండ్రీవా ఆధిక్యం ప్రదర్శించింది. ఈ గెలుపుతో ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన రెండో చిన్న వయస్కురాలిగా (19 ఏండ్లు) ఆండ్రీవా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు 1992 లో 18 ఏళ్ల వయసులో టైటిల్ సాధించిన మోనికా సెలెస్ పైన ఉంది. 

 2014లో మరియా షరపోవా తర్వాత.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గిన రష్యా అమ్మాయిగా ఆండ్రీవా రికార్డ్‌ సృష్టించింది. ఆమెకు ఇది కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌.