ప్రిన్స్ హ్యారీపై సెంటెబాలే చారిటీ పరువు నష్టం దావా

ప్రిన్స్ హ్యారీపై సెంటెబాలే చారిటీ పరువు నష్టం దావా

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీకి ఊహించని షాక్ తగిలింది. తన తల్లి ప్రిన్సెస్ డయానా జ్ఞాపకార్థం ఆఫ్రికాలోని ఎయిడ్స్ బాధితుల కోసం సొంతంగా స్థాపించిన ‘సెంటెబాలే’ స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు ఆయనపైనే కోర్టుకెక్కింది. తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆయనపై లండన్ హైకోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది. ప్రిన్స్ హ్యారీ, లెసోతో యువరాజు సీసోతో కలిసి ఈ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2006లో స్థాపించారు. 

అయితే, గతేడాది సంస్థ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ సోఫీ చందౌకాతో తలెత్తిన విభేదాలతో హ్యారీ ఈ ఆర్గనైజేషన్ నుంచి వైదొలిగారు. ఈ క్రమంలోనే ఆయన సంస్థ నాయకత్వంపై ప్రతికూల ప్రచారాన్ని నిర్వహించారని, దీని వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు సైబర్ బుల్లీయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దారితీసిందని ఆరోపించింది. ఈ ఆరోపణలను హ్యారీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.