విమోచన పోరాటం
భవిష్యత్ తరాలకు స్ఫూర్తి
స్మారక కేంద్రానికి
భూమి కేటాయించండి
సీఎం కేసీఆర్‌కు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లెటర్
హైదరాబాద్, వెలుగు: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేపట్టిన పోలీస్ చర్యతో తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సమర యోధుల చరిత్రతో కూడిన ప్రత్యేక స్మారక స్ఫూర్తి కేంద్రం ఉండాలనేది ప్రజల కోరిక అని అన్నారు. సమర యోధుల చరిత్రతో కూడిన ప్రత్యేక స్మారక స్ఫూర్తి కేంద్రం ఉండాలనేది ప్రజల కోరిక అని అన్నారు. దీనికి నిధులిస్తామని కేంద్ర పర్యాటక మంత్రి హామీ ఇచ్చారని, హైదరాబాద్‌లో ఈ కేంద్రానికి భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు కేసీఆర్‌కు ఆదివారం కిషన్‌రెడ్డి లెటర్ రాశారు. విమోచన పోరాటం దేశ చరిత్రలోనే ప్రత్యేకమైనదని కిషన్‌రెడ్డి అన్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాంపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో జాతీయ జెండా ఎగరలేదని గుర్తుచేశారు.
ప్రజలను కష్టనష్టాలకు గురిచేసిన నిజాంను గద్దెదింపి, హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కల్పించడంలో ఎంతో మంది మహా నాయకుల పాత్ర ఉందన్నారు. రజాకార్ల ఆకృత్యాలను ఎదిరించిన కుమ్రం భీమ్, పీవీ నర్సింహారావు, రామానంద తీర్థ, మర్రి చెన్నారెడ్డి, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మతోపాటు వేలాది మంది పోరాటాలు చిరస్మరణీయమని చెప్పారు. ఈ ఉద్యమం గురించి పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్, స్ఫూర్తి కేంద్రానికి కావాల్సిన స్థలాన్ని కేటాయించి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు.
