కిరణ్ అబ్బవరం ‘క’కు సీక్వెల్

కిరణ్ అబ్బవరం ‘క’కు సీక్వెల్

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన  సినిమా ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్. సుజీత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. అక్టోబర్  31న  విడుదలైన ఈ చిత్రం సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోందని, స్ర్కీన్స్ కూడా పెంచామని చెప్పింది టీమ్. శనివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌‌‌‌‌‌‌‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ దీపావళి  మాకు గుర్తుండిపోతుంది. నన్ను గతంలో పక్కింటి కుర్రాడి ఇమేజ్‌‌‌‌‌‌‌‌తో  చూశారు.

 ఇప్పుడు మన ఇంటి అబ్బాయి అని భావిస్తున్నారు. అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ కనిపించడం, టికెట్స్ కావాలని, ఇంకా థియేటర్స్ పెంచాలనే డిమాండ్స్ రావడం సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. దీనికి తప్పకుండా సీక్వెల్ చేస్తాం’ అని చెప్పాడు. తన  కెరీర్‌‌‌‌లో సత్యభామ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని నయన్ సారిక చెప్పింది.

తమ తొలి సినిమాకే బ్లాక్ బస్టర్ టాక్ రావడం సంతోషంగా ఉందని దర్శకులు అన్నారు. కొత్త కంటెంట్‌‌‌‌‌‌‌‌ను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేశారని నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.