
హైదరాబాద్ : ఈ నెల 12న కొంపల్లిలోని ప్రో కనెక్ట్ వేర్ హౌజ్ లో అమెజాన్ స్టోర్స్ లో ఆన్ లైన్ ఆర్డర్ కి చెందిన సెల్ ఫోన్ల చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ స్మార్ట్ ఫోన్లను దొంగిలించిన ఐదుగురు సభ్యుల అసోం ముఠాను నుంచి రూ 8.05లక్షల విలువ చేసే 61 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దొంగల ముఠా గురించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం…అసోం రాష్ట్రానికి చెందిన సిరాజుద్దీన్ (25) రఫిక్ హుస్సే న్(48) రెండేళ్లుగా కొంపల్లి, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు కొంపల్లిలో శ్రీనాథ్ రెడ్డి అనే మొబైల్ వ్యాపారికి చెందిన ప్రోకనెక్ట్ వేర్ హౌజ్ వద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ఇందులో అమెజాన్ ఆన్ లైన్ ఈ కామర్స్ కి సంబంధించిన మొబైల్ స్టోర్ కూడా ఉంది. అయితే ప్రతీ రోజు అక్కడే డ్యూటీ చేసే సిరాజుద్దీన్,రఫిక్ హుస్సేన్ అమెజాన్ స్టోర్స్ వద్ద సెక్యూరిటీ తక్కువగా ఉండడం గమనించారు.
ఎలాగైనా స్మార్ట్ ఫోన్లను దొంగిలించాలని ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని అసోం రాష్ట్రంలోని తమ గ్రామానికే చెందిన కొంపల్లిలోని జయదర్శిని ఎన్ క్లేవ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ నాథా(34)కి చెప్పారు. తర్వాత సిరాజుద్దీన్, రఫిక్ హుస్సేన్ అసోం రాష్ట్రంలోని తమ గ్రామానికి చెందిన ముకిబర్ రెహమాన్(20),అబ్ధుల్ మాలిక్(20),సంతు హకి, ఆరిఫ్ అలీని చోరీ కోసం సిటీకి రప్పించారు. తాము సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కొంపల్లి లోని అమెజాన్ స్టోర్స్ నుంచి విలువైన స్మార్ట్ ఫోన్లు దొంగిలించాలని సిరాజుద్దీన్, రఫిక్ హుస్సేన్ తమ గ్రామానికి చెందిన ఈ నలుగురితో వారితో కలిసి స్కెచ్ వేశారు