గోవా లిక్కర్ గ్యాంగ్ అరెస్ట్.. 1,568 బాటిళ్లు సీజ్‌‌‌‌

గోవా లిక్కర్ గ్యాంగ్ అరెస్ట్..  1,568 బాటిళ్లు సీజ్‌‌‌‌
  • గోవా లిక్కర్ గ్యాంగ్ అరెస్ట్
  • నలుగురు అరెస్ట్,1,568 బాటిళ్లు సీజ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతున్న ముఠాను శేరిలింగంపల్లి ఎక్సైజ్‌‌‌‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌‌‌‌ చేశారు. వీరి వద్ద గోవా స్టేట్‌‌‌‌కు చెందిన1,568 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ బి. గాంధీనాయక్‌‌‌‌ తెలిపిన ప్రకారం.. గోవా నుంచి హైదరాబాద్‌‌‌‌ మీదుగా లిక్కర్ అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 

ALSO READ :ధరల నియంత్రణలో కేంద్రం ఫెయిల్

నిఘా పెట్టిన ఎక్సైజ్‌‌‌‌ అధికారులు చందానగర్‌‌‌‌‌‌‌‌లోని పీజేఆర్ ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో మద్యం బాటిళ్లను దాచినట్టు గుర్తించారు. స్పెషల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్లు లతీఫ్‌‌‌‌, వెంకటరామిరెడ్డి దాడులు చేసి రామ వెంకటేశ్వరావు, మనోజ్‌‌‌‌కుమార్, ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మహిపాల్‌‌‌‌ గౌడ్‌‌‌‌లను అరెస్ట్ చేశారు. గోవా లిక్కర్‌‌‌‌‌‌‌‌ను గుంటూరు, నర్సాపూర్‌‌‌‌‌‌‌‌లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌‌‌కు పంపారు.