
- ఎవరు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం
- బల్దియా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బిల్డింగ్ సెల్లార్లలో కెమికల్స్ నిల్వ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఈవీడీఎం) డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.
గత నెల నాంపల్లిలోని బాలాజీ రెసిడెన్సీలో సెల్లార్లలో కెమికల్స్ స్టోరేజ్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అలర్ట్ అయిన బల్దియా అధికారులు నివాస ప్రాంతాల్లో, అపార్ట్మెంట్ సెల్లార్లలో కెమికల్స్ నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
రెసిడెన్షియల్ ఏరియాల్లో కెమికల్ కంపెనీలు నడపడం, స్టోరేజ్ చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి సూచించారు. 9000113667, 040-–29555500 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని.. వాట్సాప్ నంబర్‌కు ఫొటోలతో పాటు లొకేషన్ పంపాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు బయటికి వెల్లడించమని ఆయన తెలిపారు.