లింగంపల్లి–కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్

లింగంపల్లి–కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్

సికింద్రాబాద్, వెలుగు : ప్యాసింజర్ల సౌకర్యం కోసం లింగంపల్లి – కాకినాడ మధ్య స్సెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ వచ్చే నెల 1 నుంచి14వ తేదీ వరకు ప్యాసింజర్లకు అందుబాటులో ఉంటుందన్నారు. కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే  రైలు (07439)  ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందన్నారు.  కాకినాడలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుందన్నారు. ఇక లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే రైలు (07440) ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. 

ఆయా తేదీల్లో రైలు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి  నుంచి బయలుదేరి.. తర్వాతి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుందన్నారు. అయితే, ఈ రెండు మార్గాల్లో నడిచే రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, ఆకివీడు, గుడివాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగనున్నాయి. ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్​లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఇయ్యాల్టి నుంచి వచ్చే నెల 10 వరకు పలు రైళ్ల రద్దు

సిర్పూర్, కాగజ్ నగర్ స్టేషన్ల మధ్య జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ఇయ్యాల్టి నుంచి వచ్చే నెల 10 వరకు ఈ రూట్​లో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇవ్వాల్టి నుంచి వచ్చే నెల 9 వరకు సికింద్రాబాద్ –- సిర్పూర్, కాగజ్ నగర్ మధ్య నడిచే రైలును  బెల్లంపల్లి -– సిర్పూర్ మధ్య, భద్రాచలం రోడ్ –- బల్లార్షా ఎక్స్ ప్రెస్ ను వరంగల్ -– బల్లార్షా మధ్య, సిర్పూర్ టౌన్ – - భద్రాచలం రోడ్ ఎక్స్ ప్రెస్ ను .. వరంగల్– - సిర్పూర్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. వచ్చే నెల 4 నుంచి 10వ తేదీ వరకు కరీంనగర్ –- -నిజామాబాద్- ​-–కరీంనగర్​,  కరీంనగర్ – -​ -సిర్పూర్​టౌన్ –-​-కరీంనగర్, కాజీపేట్-–​ -సిర్పూర్​టౌన్, బల్లార్షా–--  కాజీపేట–- -బల్లార్షా రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు
 పేర్కొన్నారు.