ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం తీర్పు

ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం తీర్పు

ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిజమైన శివసేన ఎవరిదో ఎన్నికల కమిషన్ నిర్ణయించకుండా ఆదేశాలివ్వాలన్న ఉద్ధవ్ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. దీంతో సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి ఊరట లభించింది. అనర్హత అంశం పెండింగ్ లో ఉన్నందున నిజమైన శివసేనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవొద్దని. .ఒకవేళ ఎమ్మెల్యేలు అనర్హులుగా మారితే..నిజమైన శివసేన గుర్తింపులో వారిని లెక్కించలేమని ఠాక్రే తరుపు లాయర్ సుప్రీంలో వాదించారు. అయితే అవి రెండు వేర్వేరు అంశాలని ధర్మాసనం పేర్కొంది. 

అగస్ట్ 23న థాక్రే, షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ కు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం షిండేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉంటుందని..దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

55మంది శివసేన ఎమ్మెల్యేల్లో 40మందికిపై షిండేకు మద్ధతు ఇస్తున్నారు. బీజేపీ మద్ధతుతో జూన్ 30న షిండే సీఎంగా ప్రమాణం చేశారు. అయితే తమదంటే తమదే అసలైన శివసేన అని ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించాయి.