శునకానికి డిగ్రీ పట్టా...విద్యార్థుల చప్పట్ల మధ్య ప్రదానం

శునకానికి డిగ్రీ పట్టా...విద్యార్థుల చప్పట్ల మధ్య ప్రదానం

ప్రపంచంలో విద్యార్థులు డిగ్రీ పట్టాను అందుకోవడం చూశారు..మరి ఓ శునకం డిగ్రీ పట్టాను అందుకోవడం మీరెప్పుడైనా చూశారా..? అవును చెప్పేది నిజమే..ఓ శునకం డిగ్రీ పట్టాను అందుకుని చరిత్ర సృష్టించింది. అది కూడా అల్లా టప్పా యూనివర్సిటీ కాదు..ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి పట్టా అందుకుని తన శునకజాతికి గర్వకారణమైంది. 

కుక్కకు డిగ్రీ ఎందుకు ఇచ్చారు..

అమెరికాలోని న్యూజెర్సీలోని సెటన్‌ హాల్‌ యూనివర్సిటీలో జోసెఫ్ నైర్ గ్రేస్ మరియాని అనే మహిళ డిప్లొమా డిగ్రీ చదివింది. దీంతో గ్రాడ్యుయేషన్‌ సెర్మనీలో  వేడుకలో ఆమెకు డిప్లొమా డిగ్రీ పట్టాను అందజేసింది. ఈ డిప్లొమా చేయడంలో  జోసెఫ్ నైర్ గ్రేస్ మరియాకు తన కుక్క జస్టీన్ సహాయంగా ఉంది. ఆమెతో పాటు జస్టీన్  కూడా ప్రతీ తరగతికి హాజరైంది.  దీంతో ఆ కుక్క సిన్సియారిటీకి మెచ్చిన సెటన్ హాల్ యూనివర్శిటీ..దానికి కూడా డిప్లొమా డిగ్రీని ప్రదానం చేసింది. 

వీడియో వైరల్..

సెటన్‌ హాల్‌ వ‌ర్సిటీ ఇంచార్జి...ఆ కుక్కకు డిప్లొమా పట్టాను ఇస్తుంటే .ఆ ప‌ట్టాను శున‌కం త‌న నోటితో అందుకుంది. ఈ  స‌మ‌యంలో అక్కడున్న విద్యార్థులందరూ సంతోషంతో  కేరింత‌లు కొట్టారు. ప్రస్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ఆ వ‌ర్సిటీ త‌న ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.