
ఇప్పుడు చాలామందికి సోషల్ మీడియా అకౌంట్స్ ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి. అయితే ఏ అకౌంట్ ఓపెన్ చేసినా పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్లు, ప్రైవసీ సెట్టింగ్స్ వంటివన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ బుక్, ఇన్ స్టా వంటివైతే మెటా అకౌంట్ సెంటర్ లో స్టోర్ చేసుకోవచ్చు. తద్వారా సెట్టింగ్స్ మార్చుకోవాలనుకున్నప్పుడు ఈజీ అవుతుంది. అంతేకాదు యాడ్ ప్రిఫరెన్సుుల కూడా అకౌంట్ సెంటర్లోనే సెట్ చేసుకోవచ్చు.
ఈ అకౌంట్ సెంటర్లో 25 ఇన్ అకౌంట్ల వరకు యాడ్ చేసుకునే వీలుంది. అదెలాగం టే.. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, మెసెంజర్ వంటి ప్లాట్ ఫామ్స్ అన్నింటికీ పేరెంట్ కంపెనీ మెటా కాబట్టి వీటిలో సెట్టింగ్స్ మార్చాలనుకుంటే అన్నింటినీ ఒకేచోట చేయొచ్చు.
అందుకోసం మెటా వెబ్ సైట్ లో ఆల్రెడీ ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి లాగిన్ అవ్వాలి. దాంతో మెటా అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ప్రొఫైల్ పై క్లిక్ చేసి అకౌంట్ సెంటర్ కు వెళ్లాలి. అక్కడ మెటాకు లింక్ అయి ఉన్న అకైంట్లను అకౌంట్ సెంటర్ కు లింక్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడైనా ఏవైనా మార్పులు చేయాలనుకుంటే వెంటనే ఈ మెటా సెంటర్ కు లాగిన్ అయి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.