ప్రతి జిల్లాకు సెట్విన్‌‌‌‌‌‌‌‌

ప్రతి జిల్లాకు సెట్విన్‌‌‌‌‌‌‌‌

మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్ వెల్లడి
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:
న్యాక్ మాదిరిగా సెట్విన్ సంస్థను ప్రతి జిల్లాకు విస్తరించే ఆలోచన ఉందని మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్ తెలిపారు. ఈ సంస్థ ద్వారా యూత్‌‌‌‌కు అవసరమైన శిక్షణ ఇస్తామని చెప్పారు. యూత్, టూరిజం బడ్జెట్‌‌‌‌‌‌‌‌ పద్దులపై మంత్రి శనివారం సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, అవన్నీ బయటకు తేకుండా గత ప్రభుత్వాలు విస్మరించాయని ఆరోపించారు. తాజ్‌‌‌‌‌‌‌‌మహల్ వంటి అద్భుత కట్టడాలు రాష్ట్రంలో ఉన్నాయని, వాటికి ప్రచారం, ప్రాముఖ్యత కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ వల్లే రామప్ప గుడికి హెరిటేజ్ గుర్తింపు వచ్చిందన్నారు. చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుత్‌‌‌‌‌‌‌‌బ్‌‌‌‌‌‌‌‌షాహీ టూంబ్స్‌‌‌‌‌‌‌‌ తదితర పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకు ప్రయత్నిస్తున్నా మని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించామన్నారు.