మనీలా(ఫిలిప్పీన్స్): దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. దవావో ఒరియెంటల్ ప్రావిన్స్‌లోని మాటి సిటీలో కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడటంతో భార్యాభర్తలు, ఇద్దరు కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని, శిథిలాను తొలగించి, డెడ్‌బాడీలను వెలికితీశారు. ఈ ప్రాంతంలో 3 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
