పెరూలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటనకు టూరిస్టులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులతో పాటు పైలట్, కో పైలట్ మృతి చెందారు. టూరిస్టుల్లో ముగ్గురు డచ్కు చెందిన వారు కాగా.. ఇద్దరు చిలీ దేశస్తులున్నారు. సెస్నా 207 సింగిల్ ఇంజన్ కలిగిన ఈ విమానాన్ని ఏరో శాంటోస్ టూరిస్ట్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
