జయశంకర్భూపాలపల్లి జిల్లాలో.. విద్యుత్ షాక్ తో ఏడు బర్రెలు మృతి

జయశంకర్భూపాలపల్లి జిల్లాలో.. విద్యుత్ షాక్ తో ఏడు బర్రెలు మృతి

మొగుళ్లపల్లి/ జూలూరుపాడు, వెలుగు: విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు ఏడు పాడి గేదలు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల కింద వచ్చిన గాలి వానకు రైతు పావుశెట్టి బుచ్చయ్య పొలంలో విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయి. గ్రామానికి చెందిన రైతులు వేముల భూమారావు, ఆటో రాజయ్య, వేముల బాపూరావు, బల్గూరి సంపత్ రావు, కీర్తి లింగయ్య, రత్నం రవికి చెందిన పాడి గేదెలను మేతకు అక్కడకు తీసుకెళ్లారు. ఏడు పాడి గేదెలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాయి. 

విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత రైతులను పరామర్శించారు. ఆఫీసర్లతో మాట్లాడి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బేతలపాడు జీపీ పీక్లా తండాలో మేత కోసం వెళ్లి పొలంలో విద్యుత్​ తీగలు తగలడంతో దుక్కిటెద్దు మృతిచెందింది. తీగలు పొలంలో కింద పడి ఉండటమే ఇందుకు కారణమని ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు బానోత్​ వాలా కోరాడు.