
ఉప్పల్, వెలుగు: పేకాట ఆడుతున్న ఏడుగురిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రమేష్ తెలిపిన ప్రకారం.. ఉప్పల్ న్యూ భరత్ నగర్ సిగ్మా హోటల్ లో కొందరు పేకాట ఆడుతున్నారని సమాచారం అందింది. పోలీసులు ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో వెళ్లి హోటల్ రూమ్ నం.411పై దాడి చేశారు. అందులో ఉప్పల్ కు చెందిన తిర్పెల్లి సమ్మయ్య (52), గడ్డం ప్రభాకర్ రెడ్డి(63), సిక మహేష్(33), గొరిగే మహేష్ (36), పంచేద్దుల ఆంజనేయులు (52), గొరిగే ఐలయ్య (53), బార్ల కృష్ణ (40) బెట్టింగ్ పెట్టి పేకాట ఆడుతున్నారు. వారిని అరెస్టు చేసి రూ.30,770 నగదు, 6 స్మార్ట్ ఫోన్లు, ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ రమేశ్ తెలిపారు.