ఒకే బైక్పై ఏడుగురు..అరేయ్ ఏంట్రా ఇది..

ఒకే బైక్పై ఏడుగురు..అరేయ్ ఏంట్రా ఇది..

బైక్ పై ఒకరు..లేదా ఇద్దరు ప్రయాణించడం సులభం. కొన్ని సందర్భాల్లో అతి కష్టం మీద ముగ్గురు ప్రయాణిస్తుంటారు. ఇది ట్రాఫిక్ ఉల్లంఘన కిందకు వస్తుంది. అయినా తప్పని పరిస్థితుల్లో  ముగ్గురు బైక్ పై వెళ్తుంటారు.  కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. అవును..ఒకే బైక్ పై ఏడుగురు రోడ్లపై చక్కర్లు కొట్టారు. 

ఎక్కడంటే..

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ బైక్ పై  ఏకంగా ఏడుగురు ప్రయాణం చేస్తూ రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకెళ్లారు. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా..మరో వ్యక్తి అతని ముందు కూర్చున్నాడు. బైక్ నడిపే వ్యక్తి  వెనకాల నలుగురు కూర్చున్నారు. ఏడో వ్యక్తి చివరి వ్యక్తి భుజాల పైన కూర్చోవడం గమనార్హం. వీరందరూ 18 ఏండ్ల వయసు కంటే తక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది.  ఏడుగురు బాలురు బైక్ పై ప్రయాణిస్తుండగా కార్లో ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. 

సజ్జనార్ సార్ ఆగ్రహం..

ఉత్తరప్రదేశ్ లో  ఒకే బైక్ పై ఏడుగురు ప్రయాణిస్తున్న వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన... ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌.  ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దం..అని కామెంట్ చేశారు.