రంజీ ట్రోఫీ ప్లేట్ సెమీఫైనల్లో తనయ్‌‌‌‌కు ఏడు వికెట్లు

రంజీ ట్రోఫీ ప్లేట్ సెమీఫైనల్లో తనయ్‌‌‌‌కు ఏడు వికెట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తనయ్‌‌‌‌ త్యాగరాజన్ (7/63) ఏడు వికెట్లతో విజృంభించడంతో నాగాలాండ్‌‌‌‌తో రంజీ ట్రోఫీ ప్లేట్ సెమీఫైనల్లో హైదరాబాద్ పట్టు బిగించింది. ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో  ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 383/5తో  రెండో రోజు శనివారం ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ను 462/8 వద్ద డిక్లేర్ చేసింది.

అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన నాగాలాండ్ తనయ్ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 206 రన్స్‌‌‌‌కే ఆలౌటై ఫాలోఆన్‌‌‌‌లో పడింది. తర్వాత ఫాలోఆన్‌‌‌‌తో రెండో ఇన్నింగ్స్‌‌‌‌కు వచ్చిన ఆ జట్టు  రెండో రోజు చివరకు 20/1 స్కోరుతో నిలిచింది. నాగాలాండ్ ఇంకా 236 రన్స్‌‌‌‌ వెనుకంజలో ఉంది.