టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నేతలు

టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నేతలు

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసే ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ మారేడ్ పల్లిలోని మంత్రి తలసాని నివాస క్యాంపు కార్యాలయంలో అంబర్ పేట్ నియోజకవర్గం, గోల్నాక డివిజన్ కు చెందిన పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇందులో బీజేపీ సీనియర్ అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్ తన అనుచరులతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. 

వారికి మంత్రి తలసాని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత ముప్పై సంవత్సరాల నుండి బీజేపీలో నమ్మకంగా పని చేస్తుంటే గుర్తింపు లేకపోగా, నిన్న మొన్న వారికి పదవులు ఇస్తున్నారని నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యాక్తం చేశారు. ఏండ్ల తరబడి బీజేపీలో పని చేస్తున్నా.. కిషన్ రెడ్డి పట్టించుకోవకపోవడంతో టీఆర్ఎస్ లో చేరినట్లు నర్సింగ్ యాదవ్ తెలిపారు.