
బీహర్ లోని పడవ ప్రమాదం జరిగింది. భగల్ పూర్ దగ్గర గంగానదిలో జరిగిన పడవ ప్రమాదంలో దాదాపు 70 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 100 ప్రయాణిస్తున్నారు. బోటు ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పడవలో ఉన్నవారిలో 30 మందిని ఒడ్డుకు చేర్చారు. మిగతా వారి ఆచూకీ దొరకలేదు. వారి కోసం ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.