
హైదరాబాద్, వెలుగు : సిటీలోని పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి వాన కురిసింది. షేక్‌పేట, బాలానగర్, శేరిలింగంపల్లి, ఆర్సీపురం ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. మరో రెండ్రోజుల పాటు సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.