
జర్మనీలోని హాంబర్గ్ లో కాల్పుల కలకలం రేపింది. స్థానికంగా ఉన్న చర్చిలో కాల్పుల విధ్వంసానికి ఏడుగురు అమాయకులు బలయ్యారు. గురువారం సాయంత్రం చర్చిపై కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బైబిల్ ప్రార్థనలక వెళ్లిన వాళ్లపై విచక్షనారహితంగా కాల్సులకు తెగబడ్డారు. అందులో ఏడుగురు చనిపోగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అయితే, ఈ కాల్పులకు తెగబడటం వెనక కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపిన దుండగులు పారి పోయారు. వాళ్లకోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
ప్రస్తుతం గాయపడిన వాళ్లను హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు మాత్రం ఎంతమంది చనిపోయారని మాత్రం ఇంకా స్పష్టత నీయలేదు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరోవైపు పాలస్తీనాలో కూడా ఇలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉండే సెంట్రల్అవివ్ వీధిలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కాల్చి చంపారు.