హైదరాబాద్ కమిషనరేట్లో 2865 మంది బదిలీ

హైదరాబాద్ కమిషనరేట్లో 2865 మంది బదిలీ

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా పోలీసు సిబ్బందిని బదిలీ చేశారు. 2,865 మందిని  ట్రాన్స్ఫర్ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 219 మంది ఏఎస్ఐలు, 640 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 2006మంది పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ట్రాన్స్ ఫర్లు పెండింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో 5 నుంచి 7ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారిని ఆన్ లైన్ ద్వారా బదిలీ చేశారు. ట్రాన్స్ఫర్ల కోసం తెలంగాణ పోలీసులు రూపొందించిన హెచ్ఆర్ఎంఎస్ యాప్ను ఉపయోగించారు.