ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్‌లోని పలు గ్రామాలు దట్టమైన పొగమంచుతో కశ్మీర్‌ను తలపిస్తున్నాయి. కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో ఉదయం ఏడు దాటినా పొగమంచు వీడడం లేదు. మంచు కారణంగా ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకునే ప్రయాణం చేయాల్సి వస్తోంది. – కాగజ్‌నగర్, వెలుగు
