ఏ తల్లి బిడ్డలో

ఏ తల్లి బిడ్డలో
  • పోలీసులకు సవాల్ గా యాదగిరి గుట్ట సెక్స్ రాకెట్ కేసు

రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిం చిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగి రిగుట్ట పరిసరాల్లో ని సెక్స్ రాకెట్ వ్యవహారం అది.అప్పట్లో వ్యభిచార గృహాల నిర్వాహకులను అదుపు లోకి తీసుకొ ని.. చీకటి చెర నుంచి 36 మంది చిన్నారులను పోలీసులు విడిపించారు. అందులో ఎక్కువ మంది నాలుగేళ్ల నుంచి 10ఏళ్ల లోపు వారే. కానీ..ఇప్పటికీ ఆ బిడ్డల తల్లిదండ్రులు ఎవరన్నది మాత్రం తేలడం లేదు. ఆఖరికి డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించినా ఫలితం కనిపించడం లేదు. కేవలం ముగ్గురు ఆడబిడ్డల తల్లిదండ్రులను మాత్రమే డీఎన్ ఏ పరీక్షల ద్వారా గుర్తించగలిగారు. 8 మంది పిల్లల రిపోర్టులు రావాల్సిఉంది . 25 మంది రిపోర్టులు ఎవరితో సరిపోలడం లేదు. ఫలితంగా ఆ చిన్నారుల కన్నవారిని గుర్తించడం అధికా ర యంత్రాంగానికి సవాల్ గా మారింది.

గుట్ట పరిసరాల్లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారని, అందులో బాలికలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని స్థానికులు కొందరు గత ఏడాది ఆగస్టులో షీ టీమ్ కు సమాచారం అందిం చడంతో పోలీసులు నెలరోజుల పాటు  రైడ్ చే శారు. శారీరక ఎదుగుదలకు, తొందరగా రజస్వల అయ్యేందుకు ప్రమాదకర హార్మోన్‍ గ్రోత్‍ ఇంజక్షన్లు ఇచ్చి.. 14ఏళ్లు దాటగానే వ్యభిచార కూపంలోకి  పిల్లలను దింపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

పోలీసులు దాడులకు వస్తే దొరకకుండా  ఇళ్లల్లో సొరంగాలు తవ్వించి అందులో బాలి కలను దాచి పెడుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి .పోలీసుల దాడులతో హడలిపోయిన వ్యభిచార గృహాల నిర్వాహకులు ఇళ్లకు తాళాలు వేసి పారిపోయారు. అప్పట్లో నే 22 ఇళ్లను రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేయగా.. ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

29 మంది నిర్వాహకులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మంది జైలు జీవితం గడుపుతున్నారు. 36 మంది పిల్లలను చెర నుంచి విడిపించి పోలీసులు, ఇందులో 26 మందిని రంగారెడ్డి జిల్లాలోని ఓ ఆశ్రమానికి, ఏడుగురిని నల్లగొండలోని మరో ఆశ్రమానికి తరలిం చారు. ఈ ఘటన మీడియాలో రావడంతో ఆ పిల్లలు తమ వారేనంటూ గుంటూరు, ప్రకాశం, వరంగల్ , పశ్చిమగోదావరి ఇలా పలు ప్రాంతాల నుంచి సుమారు 14 ఫ్యామిలీలు యాదాద్రి పోలీస్​స్టేష న్ కు వచ్చాయి . తమ పిల్లలుగతంలో కిడ్నాప్ అయ్యారని, ఈ 36 మందిలో వారు ఉండి ఉంటారని పిల్లల ఫొటోలు పట్టుకొ ని కొన్ని రోజులు పోలీస్​స్టేష న్ చుట్టూ తిరిగారు.

ఆధారాలను సమగ్రంగా పరిశీలిం చాక నిర్ణయం తీసుకుంటామనిపోలీసులు నచ్చజెప్పి పంపించారు. అయితే పట్టుబడ్డ పిల్లలంతా తమ పిల్లలే నని వ్యభిచార గృహాల నిర్వాహకులు చెబుతూ వచ్చారు. ఈ పిల్లలంతా వ్యభిచార వృత్తిలో పుట్టారని, వీళ్ల తల్లులు కొందరు పారిపోయారని, ఇంకొందరు తల్లులు రోగాల బారినపడి చనిపో యారని చెప్పుకొచ్చా రు. ఈ క్రమంలో పోలీసులు 36 మంది పిల్లలకు, వ్యభిచార గృహాల నిర్వాహకులకు డీఎన్ ఏ పరీక్షలు చేపట్టగా.. ఇందులో 28 రిపోర్టులుఇటీవల వచ్చాయి . వీటిలో కేవలం ముగ్గురు పిల్లల డీఏఎన్.. వ్యభిచార గృహ నిర్వాహకుల డీఎన్ ఏతోసరిపోలింది.

ఇంకా ఎనిమిది మంది పిల్లల రిపోర్టులు రావాల్సి ఉండగా.. 25 మంది చిన్నారుల రిపోర్టులు ఎవరితో సరిపోలేదు.యాదగిరి గుట్ట అమానుష ఘటనలో తమ పిల్లలు ఉన్నారేమోనన్న ఆందోళనతో పోలీస్‍ స్టేష న్ కు వచ్చివేడుకున్న తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ పిల్లలు తమకు దక్కితే చాలని కోరుకుంటున్నారు. ఘటనపై అప్పట్లో నే సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టి.. పిల్లలకు ఎవరినీ కలువనీయొద్దనే ఆదేశాలిచ్చింది.

ఆ చిన్నారుల్లో కొందరు రంగారెడ్డి జిల్లాలోని ఓ ఆశ్రమంలో, మరికొందరు నల్లగొండ లోని మరో ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు.ఇంజక్షన్ల ప్రయోగం జరగలేదు చిన్నారుల శారీరక ఎదుగుదలకు ఇంజక్షన్లను ప్రయోగించారా, లేదా అని తేల్చేం దుకు చేపట్టిన పరీక్షల్లో ఎలాంటి ఇంజెక్షన్ల ప్రయోగం జరగలేదని తేలిందని సీడబ్ల్ యూసీ చైర్మన్‍ నిమ్మయ్య తెలిపారు. చిన్నారుల శారీరక ఎదుగుదల కోసం ప్రమాదకర హార్మోన్‍ గ్రోత్‍ ఇంజెక్షన్లను ప్రయోగించారని, అందుకు ఆర్ ఎంపీ నరసింహను ఉపయోగించారని ఆరోపణలు రావడంతో అప్పట్లో నే అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.