చిదిమేస్తున్నారు: మైనర్లపై పెరుగుతున్న లైంగిక దాడులు

చిదిమేస్తున్నారు: మైనర్లపై పెరుగుతున్న లైంగిక దాడులు

పసివాళ్ల మీద లైంగికదాడులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. చిన్నారుల మీద జరుతున్న లైంగిక హింసను అరికట్టేందుకు చేసిన నిర్భయ లాంటి చట్టాలు, తీసుకుంటున్న చర్యలు ఏమీ  పని చేయడంలేదు. మూడేళ్ల నుంచి 13 ఏళ్ల చిన్నపిల్లల పట్ల ఈ తరహా నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో చిన్నారులను బయటకు పంపాలంటే నే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులున్నాయి. హోలీ పండుగ నాడు అల్వాల్‌ లో ఆరేళ్ల చిన్నారి మీద అత్యాచారం చేసిన బీహార్ కు చెందిన రాజేష్ కుమార్ ఆమె మెడకు వైర్‌‌ బిగించి హత్య చేశాడు. ఈ ఘటన మరువకముందే సోమవారం రాత్రి గోల్కొండలో 13 ఏళ్ళ బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డా డు, ఈ రెండు ఘటనలు చిన్నారుల భద్రతపై ఆందోళన పెంచుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 8142 కేసులు…..

ఏటేటా బాలికల మీద లైంగికదాడుల కేసులుపెరుగుతున్నాయి. 2013 నుంచి 2019 జనవరి నెలాఖరు వరకు పోక్సో చట్టం కింద రాష్ట్రంలో 8142 కేసులు నమోదయ్యాయి. 2013లో 281 కేసులు మాత్రమే నమోదు కాగా, 2018లో కేసుల సంఖ్య 2080కు చేరింది. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే రాష్ట్రంలో 137 కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాది జనవరిలో ఒక్క వికారాబాద్ జిల్లాలోనే 30 పోక్సో కేసులు నమోదు అయ్యాయి.ఈ ఆరేళ్ళలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 967 పోక్సో కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో అత్యాచార కేసులను పోలీసుశాఖ సీరియస్‌‌గా తీసుకుంటోంది. లక్డీకాపూల్ లో ఏర్పాటు చేసిన విమెన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నిం దితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో నమోదయిన కేసులకు సంబంధిం చిన రికార్డులను సేకరించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా నివారణ చర్యలు చేపట్టింది.

ఏడాదిలోనే శిక్షలు ఖరారు….

పోక్సో కేసుల్లో నిం దితులకు శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు త్వరితంగా విచారణ చేస్తున్నాయి. సైఫాబాద్ లోని చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ జడ్జి సునీత కుంచల పోక్సో కేసుల్లో శిక్షలు ఖరారు చేస్తున్నారు. గత ఏడాది ఎప్రిల్ నుంచి 151 ఛార్జ్ షీట్లు దాఖలు కాగా, 2019లో ఇప్పటి వరకు 65 ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. ఈ కేసులను విచారించిన చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ 2018 ఎప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు 27 మందికి శిక్షలు ఖరారు చేసింది. ఇందులో ఆరుగురికి జీవిత ఖైదు విధించిన న్యాయమూర్తి మరో 21 మందికి 10 ఏళ్ల జైలు శిక్షలు వేశారు. ఏడాదిలోపే ట్రయల్స్ పూర్తి చేసిన దోషులకు శిక్షలు విధించడంతో పాటు బాధితులకు పరిహారం చెల ్లించేలా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ తీర్పులు ఇస్తోంది.