స్వామి చైతన్యానంద సరస్వతిపై లైంగిక వేధింపుల కేసు.. కార్ సీజ్.. పలు సెక్షన్ల కింద నమోదు..

  స్వామి చైతన్యానంద సరస్వతిపై లైంగిక వేధింపుల కేసు.. కార్ సీజ్.. పలు సెక్షన్ల కింద నమోదు..

స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ విద్యాసంస్థ అధిపతి. ఢిల్లీలోని వసంత కుంజ్ లో ఉన్న ఆయన సంస్థలో చదువుతున్న 15 మంది విద్యార్థినులు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దింతో ఆయన పై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. 

నిందితుడు పార్థసారథి నకిలీ 'UN' నంబర్ ప్లేట్‌తో కొత్త వోల్వో కారును ఉపయోగిస్తున్నట్లు  గుర్తించిన పోలీసులు ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. వసంత్ కుంజ్ పై నార్త్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుకాగా, సెక్షన్ 164 కింద బాధితుల వాంగ్మూలాలను కోర్టులో నమోదు చేశారు. అలాగే నిందితుడు ఆగ్రా సమీపంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చర్యలు చేపట్టారు. 

విచారణ సమయంలో, 32 మంది విద్యార్థినుల వాంగ్మూలాలను నమోదు చేయగా, అందులో 17 మంది నిందితుడు దుర్భాష, అసభ్యకరమైన వాట్సాప్/ఎస్ఎంఎస్ మెసేజులు, అవాంఛిత శారీరక సంబంధంలో ఉన్నారని ఆరోపించారు. ఫ్యాకల్టీ/అడ్మినిస్ట్రేటర్లుగా పనిచేస్తున్న మహిళలు నిందితుడి డిమాండ్లకు అనుగుణంగా తమను ప్రోత్సహించి, ఒత్తిడి చేశారని బాధితులు ఆరోపించారు. విద్యార్థులు అతనిపై అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డాడని, అతనికి పరిచయం చేసిన కొంతమంది వార్డెన్లు అతనికి సహకరించారని ఆరోపించారు. 

స్వామి చైతన్యానంద సరస్వతితో  కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠంకి ఎలాంటి సంబంధాలు లేదని, అతని ప్రవర్తన అక్రమం, అనుచితం అని సంస్థ ప్రకటించింది. అలాగే స్వామి చైతన్యానందని సంస్థ నుండి తొలగించామని, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకస్తామని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి  రావడంతో  సంస్థ విద్యాసంస్థలలోని విద్యార్థుల భద్రత గురించి తీవ్ర ఆందోళనలను పెంచుతోంది.

న్యూఢిల్లీలోని వసంత కుంజ్‌లో ఉన్న శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్-రీసెర్చ్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ద్వారా అధికారికంగా గుర్తింపు పొందిందని, పీఠ్ పర్యవేక్షణలో పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఈ సంస్థను ప్రఖ్యాత విద్యావేత్త డాక్టర్ కృష్ణ వెంకటేష్ అధ్యక్షతన ఉన్న పాలక మండలి నిర్వహిస్తుంది. విద్యార్థుల ప్రయోజనాలను పూర్తిగా కాపాడుతామని, వారి విద్య, విద్యా కార్యక్రమాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని పాలక మండలి హామీ ఇస్తుంది.