- విద్యార్థుల 12 డిమాండ్లను పరిష్కరించాల్సిందే
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో వేలాది మంది విద్యార్థుల సమస్యలను గాలికొదిలేసి, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.రజినీకాంత్, టి.నాగరాజు ఆదివారం ఒక ప్రకనటలో డిమాండ్‌చేశారు. ఆర్జీయూకేటీలో విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే సహించబోమన్నారు. విద్యార్థుల న్యాయమైన12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇంజినీరింగ్ అకాడమిక్ ఇయర్ ముగుస్తున్నా విద్యార్థులకు ఇప్పటికీ ల్యాప్‌టాప్‌లు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. శివశక్తి మెస్ కాంట్రాక్ట్ తో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని, వెంటనే ఆ కాంట్రాక్టును రద్దు చేయాలన్నారు. యూనివర్సిటీలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే విద్యార్థిని తేజస్విని మృతి చెందిందని ఆరోపించారు. ఇందుకు కారణమైన అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
