పేపర్ లీక్ పై ఎంక్వైరీకి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ డిమాండ్

పేపర్ లీక్ పై ఎంక్వైరీకి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, కాళోజీ హెల్త్ వర్సిటీ ఎగ్జామినేషన్ అధికారులు కుమ్మక్కై క్వశ్చన్ పేపర్లు లీక్ చేశారని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎల్ మూర్తి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ల లీక్ వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ ఏడాది మార్చిలో జరిగిన ఫస్టియర్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45% మంది ఫెయిలయ్యారు. తర్వాత జరిగిన సప్టిమెంటరీలో పేపర్లు లీక్ అయ్యాయి.

దీంతో సప్టిమెంటరీ రాసిన వారిలో 92.5% మంది పాస్ అయ్యారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తమ స్టూడెంట్లకు పేపర్లు లీక్ చేయడం వల్లే ఇలా జరిగింది” అని మూర్తి అన్నారు.