జర్నలిజం ఎగ్జామ్​ను మళ్లీ పెట్టాలి

జర్నలిజం ఎగ్జామ్​ను మళ్లీ పెట్టాలి
  • సీపీ గెట్​ కన్వీనర్​కు ఎస్ఎఫ్ఐ వినతి

ఓయూ, వెలుగు :  కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ)లోని జర్నలిజం పరీక్షను  మళ్లీ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు.  మంగళవారం సీపీ గెట్​ కన్వీనర్​ ప్రొఫెసర్​ పాండురంగారెడ్డికి వినతి పత్రం అందించారు. ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ.. జర్నలిజం పరీక్షలో సిలబస్ ప్రకారం పార్ట్(ఎ) 40 మార్కులు, పార్ట్(బి) 60 మార్కులు రావాలన్నారు.  

జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, జర్నలిజం సంబంధించి ప్రశ్నలే వచ్చాయని వారు పేర్కొన్నారు. మొత్తం 950 విద్యార్హులు మంది దరఖాస్తు చేసుకోగా.. 799 మంది  పరీక్షకు హాజరయ్యారని, సిలబస్​తో సంబంధం లేకుండా పేపర్​ ఇవ్వడంతో ర్యాంకులు కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ తిరిగి నిర్వహించాలని కోరారు. దీనిపై కన్వీనర్​ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్.మూర్తి, స్టూడెంట్లు ఉన్నారు.