అగ్రి వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దు

అగ్రి వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దు

హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీ భూమిని కేటాయించడం సరికాదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్​ఎల్​ మూర్తి, నాగరాజు చెప్పారు.

భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవో 55ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. యూనివర్సిటీల అధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఉద్యానవన వర్సిటీ భూమి 57.5 ఎకరాలు, వ్యవసాయ వర్సిటీ  నుంచి రూ.42.5 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించం సరికాదన్నారు.

విద్యార్థుల పరిశోధనలు కోసం, వర్సిటీ అవసరాల కోసం మాత్రమే ఆ భూములను ఉపయోగించాలని, హైకోర్టుకు కేటాయించిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టుకు వేరే చోట ల్యాండ్ కేటాయించాలని లేకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.